
రాష్ట్రానికి భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ, ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పï³డనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి అనంతరం వాయుగుండంగా మారే సూచనలున్నాయి.
అనంతరం పశ్చిమ–వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా విశాఖకు సమీపంలో తీరం దాటవచ్చని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.