ఏపీ కేబినెట్‌ చివరి భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే

AP Cabinet Key Decisions Cabinet Reshuffle YS Jagan Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. చివరి మంత్రి వర్గసమావేశంలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ముఖ్యమైనవి..

జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్లానింగ్‌ సెక్రటరీ విజయకుమార్‌ సహా, అధికారులందరూ సమర్ధవంతంగా నిర్వహించారని ప్రశంసించిన మంత్రిమండలి సభ్యులు. అధికారులను అభినందిస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన కేబినెట్‌. 
2021–22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన స్వయం సహాయక సంఘాలకు  వైయస్సార్‌ సున్నావడ్డీ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం.
రాష్ట్రంలో కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటుచేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్పసవరణలకు కేబినెట్‌ ఆమోదం.
కొత్తగా కొత్తపేట, పులివెందుల రెవిన్యూ డివిజన్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. 
7 మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు. 
8 మండలాలతో పులివెందుల రెవిన్యూ డివిజన్‌కు కేబినెట్‌ ఆమోదం.
చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల డివిజన్‌.
విభజించిన తర్వాతకూడా వైయస్సార్‌ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో కొత్తగా పులివెందుల డివిజన్‌.
12 పోలీసు సబ్‌డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం.
జిల్లాల విభజన నేపథ్యంలో ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి కొనసాగిస్తూ ఆర్డినెన్స్‌.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మిల్లెట్‌మిషన్‌ (2022–23  నుంచి 2026–27 వరకూ)కు కేబినెట్‌ ఆమోదం. 
ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్‌ డిగ్రీకాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పోస్టులు.
దాదాపు 253 పోస్టులు (23 ప్రిన్సిపల్, 31 టీచింగ్, 199 నాన్‌టీచింగ్‌ పోస్టులకు కేబినెట్‌ ఆమోదం. 
ప్రకాశంజిల్లా దర్శిలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ డిగ్రీకాలేజీలో 24 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌టీచింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం. 
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.
పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులకు  కేబినెట్‌ ఆమోదం.
సర్వే సెటిల్‌మెంట్స్‌ మరియు ల్యాండ్‌ రికార్డుల డిపార్ట్‌మెంట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌. 
రాష్ట్రంలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగులు.
ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్యసేవలు అందించనున్న ఆస్పత్రులకు భూముల కేటాయింపు.
దీంట్లో భాగంగా, కాకినాడ అర్బన్‌ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం.
కర్నూలు జిల్లా కల్లూరు గ్రామంలో అత్యాధునిక ఆస్పత్రికోసం 5 ఎకరాల భూమి కేటాయింపు.
విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్‌ హబ్‌ కింద అత్యాధునిక ఆస్పత్రికి ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు.
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్‌ గ్రామంలో 4 ఎకరాల భూమి హెల్త్‌ హబ్‌ కింద ఏర్పాటయ్యే ఆస్పత్రికి కేటాయింపు.
శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల భూమిని హెల్త్‌ హబ్‌ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆస్పత్రికి కేటాయింపు.
ఏపీ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు హోటల్‌ మరియు కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రాజమండ్రి అర్భన్‌ లో 6 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం. 
కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీకి 100 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 
కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసేందుకు 15.31 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం, కేబినెట్‌ ఆమోదం.
ప్రభుత్వ ఐటీఐని ఏర్పాటు చేసేందుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌. 
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాల భూమి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేటాయింపు.
విండ్‌ టర్బైన్‌ జనరేటర్లను ఏర్పాటుచేయనున్న ఐఓసీఎల్‌.
కర్నూలు జిల్లా డోన్‌ మండలం ఉడుములపాడులో ఆగ్రోకెమికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ విస్తరణకు 10.06 ఎకరాలు కేటాయింపు. 
కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్‌ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమిని ఏపీఎస్‌ఆర్టీసికి కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.
రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం. 
నిజాపంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో 280 ఎకరాలను ఏపీ మత్స్యశాఖకు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం.
మడ్‌క్రాప్‌ హేచరీస్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్న ఏపీ మత్స్యశాఖ. 
కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు 82.34 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 
ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాలను కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం. 
గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రిక విస్తరణకోసం 0.89 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్, మైసూరుకు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం. 
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించే తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top