కాకాణిపై మరో అక్రమ కేసు నమోదు | Another Illegal Case Against Kakani Govardhan Reddy | Sakshi
Sakshi News home page

కాకాణిపై మరో అక్రమ కేసు నమోదు

Apr 9 2026 11:30 AM | Updated on Apr 9 2026 4:00 PM

Another Illegal Case Against Kakani Govardhan Reddy

సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఫిర్యాదుతో వేదాయపాలెం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. శాంతియుత నిరసన చేసిన కాకాణితో సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా, మావిగన్‌ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళలను కించపరిచేలా ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏబీఎన్‌ చానల్‌లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు బుధవారం కన్నెర్ర చేశాయి. మహిళలపై అసభ్యకరమైన భాషలో కొత్త పలుకు పేరుతో చెత్త రాతలు, హేయమైన కారుకూతలతో ప్రసారం చేశారంటూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రజల మద్దతు రోజురోజుకు మావిగన్‌ విషయంలో ఆదరణ పెరుగుతుందని ముందుగానే పసిగట్టిన రాధాకృష్ణ ముఠా వ్యక్తిగత హననానికి పూనుకుందని కాకాణి ధ్వజమెత్తారు.

కాకాణిపై మరో అక్రమ కేసు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement