మద్యం వినియోగంలో 65 శాతం తగ్గుదల

Alcohol Consumption Decreased By 65 Percent In AP - Sakshi

మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే సత్ఫలితాలు

తెలంగాణలో కేవలం 0.31 శాతం మాత్రమే తగ్గుదల

గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వినియోగం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ ఆదాయం కూడా భారీగానే తగ్గిపోయింది. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మద్య వినియోగంలో 65 శాతం తగ్గుదల ఉండగా, బీరు వినియోగంలో అయితే ఏకంగా 91.76 శాతం తగ్గుదల నమోదైంది. ప్రభుత్వ ఆదాయం 28.411 శాతం తగ్గింది. గత ఆరి్థక ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు అమ్మకాల్ని ఈ ఏడాదితో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. అమ్మకాల విలువలో 32.48 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గతేడాది ఏప్రిల్‌–ఆగస్టు అమ్మకాలను, వినియోగాన్ని పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో (ఏప్రిల్‌–ఆగస్టు) ఈ ఏడాది పోల్చి చూస్తే కేవలం 0.31 శాతం మాత్రమే మద్యం వినియోగం తగ్గింది. కానీ.. ప్రభుత్వ ఆదాయంలో మాత్రం 2.93 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అమ్మకాల విలువలో 4.66 శాతంవృద్ధి నమోదైంది.  (చదవండి: మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం)

ఐదు నెలల్లో రూ.2,170 కోట్లు ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ 
గతేడాది ఏప్రిల్‌–ఆగస్టు మధ్య కాలంలో మద్యం ద్వారా రూ.7,638.24 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచి్చంది. ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,468.17 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. అంటే గతేడాది కంటే రూ.2,170.07 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. 
మద్యం, బీరు అమ్మకాల విలువ పరిశీలిస్తే ఐదు నెలల (ఏప్రిల్‌ – ఆగస్టు) వ్యవధిలో గతేడాది రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.5,998.87 కోట్లు మాత్రమే. అమ్మకాల విలువ గతం కంటే రూ.2,885.82 కోట్లు తక్కువగా నమోదైంది. 
దక్షిణాదిలో అతి చిన్న రాష్ట్రం కేరళలో కంటే మద్యం వినియోగం ఏపీలో తక్కువగా ఉండటం గమనార్హం. (చదవండి: మద్యం మత్తులో యువతుల హల్‌చల్‌)
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top