నేటి నుంచి ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘సర్‌’

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

సాక్షి, పాడేరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్‌) జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. సర్వేకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫారాలు కలెక్టరేట్‌కు సకాలంలో చేరుకోకపోవడంతో బీఎల్‌వోలకు పంపిణీ చేయలేకపోయారు.రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి సర్‌ ప్రారంభమైనప్పటికీ జిల్లాలోని పాడేరు,అరకులోయ నియోజకవర్గాల్లో మాత్రం జరగలేదు. కలెక్టరేట్‌కు సోమవారం ఎన్యుమరేషన్‌ ఫారాలు చేరుకోవడంతో వాటిని రెండు నియోజకవర్గాల్లోని ఎన్నికల డీటీలకు కలెక్టరేట్‌ అధికారుల పంపిణీ చేశారు.వాటిని ఆయా మండలాల్లోని బీఎల్‌వోలకు సాయంత్రం నాటికి అందజేశారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలో మంగళవారం నుంచి ఓటర్ల సమగ్ర సర్వేకు రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.అరకులోయ నియోజకవర్గంలో 2,48,665 మంది ఓటర్లు,పాడేరు నియోజకవర్గంలో 2,51,087 మంది ఓటర్లు ఉన్నారు.వైఎస్సార్‌సీపీతో పాటు పలు రాజకీయ పార్టీల బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల సమక్షంలో బీఎల్‌వోలంతా ఓటర్ల సమగ్ర సర్వే జరపడంతో పాటు ఎన్యుమరేటర్ల ఫారాలు ఓటర్లకు అందజేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement