అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేసి 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేసి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణం అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో వెండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని అధిష్టింపజేసి అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు.
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు


