అభాగ్యులకు అండగా..

youth Service programs in vizianagarm district - Sakshi

సేవా కార్యక్రమాలు చేపడుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

ఆదరణ లేని వృద్ధులకు సీజనల్‌ సాయం

విజయనగరం అర్బన్‌: ‘మానవ సేవయే మాధ వ సేవ’ అన్న నానుడిని బాగా వంటబట్టించుకున్నారు. ఆకలితో ఎవ్వరూ చనిపోకూడదని నిర్ణయించుకుని, సేవాభావం గల పది మంది యువకులు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ప్రస్తుతం వారంతో ఉద్యోగరిత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నా రు. వీరి మనసులను అర్థం చేసుకున్న మరికొంతమంది సభ్యులుగా చేరి వారున్న ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

వివరాల్లో కి వెళితే...విజయనగరం పట్టణానికి చెందిన వర్రి శివప్రసాద్‌ హైదరాబాద్, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే రోజుల్లో కుటుంబ సభ్యుల ఆదరణ లేక రోడ్ల మీద చాలా మంది చనిపోవడాన్ని దగ్గర నుంచి చూశారు. ఇకపై ఎవ్వరూ ఆకలితో చనిపోకూడదని నిర్ణయించుకుని తనతో ఇంట ర్, ఇంజినీరింగ్‌ చదువుకునే పది మంది స్నేహితులను సంప్రదించి 2015 ఫిబ్రవరిలో ‘ఎయిడ్‌ ది ఏజ్డ్‌’ (ఏటీఏ) సమైక్య సహకార వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వీరందరూ తమకున్న ఆర్థిక వనరులతో వారాంతా ల్లో రోడ్లపై కనబడిన వృద్ధులకు ఆహారం, రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నారు.

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా..
పది మంది సభ్యులతో ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 180 మంది దాకా సభ్యులు చేరారు. సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తిం చిన కొంతమంది తాము కూడా సంస్థలో సభ్యులుగా చేరి వారుంటున్న ప్రదేశాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2015లో ఏర్పాటైన సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వర్రి శివప్రసా ద్‌ (విజయనగరం) వ్యవహరిస్తుండగా, ప్రధాన కా>ర్యదర్శిగా చిన్నంటి వెంకటేశ్వర్లు (ఒంగోలు), వైస్‌ ప్రెసిడెంట్‌గా లక్ష్మీనారాయణ (శ్రీకాకుళం), కోశాధికారిగా జీఎస్‌ భాస్కర్‌ (విజయనగరం), సభ్యులుగా పి.రాజేంద్రప్రసాద్‌ (తుని), వర్రి వాసు (విజయనగరం), వీజీఎస్‌ నాయుడు (వైజాగ్‌), పి.సంతోష్‌కుమార్‌ (శ్రీకాకుళం), ఎ.చంద్రశేఖర్‌ (శ్రీకాకుళం) ఉన్నారు. ఇతర సభ్యులు కూడా వారుంటున్న ప్రదేశాల్లో అనుబంధ సంఘాలుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేపడుతుండడం విశేషం.

సీజనల్‌ సేవలు
సభ్యులు ప్రతి ఆదివారం వారు న్న ప్రదేశాల్లో వృద్ధులు, అనాథలను గుర్తించి అన్నదానం చేపడుతున్నారు. అలాగే శీతాకాలంలో రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం, హైదరా బాద్‌లోని అమీర్‌పేట, భరత్‌నగరా ఫ్‌లై ఓవర్, వెంకటగిరి, కృష్ణానగర్, ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతా ల్లో సభ్యులు సేవలందిస్తున్నారు.  

అన్ని పట్టణాలకూ..
ఆకలితో ఎవ్వరూ చనిపోకూడదనే ఉద్దేశంతోనే ఏటీఏ ప్రారంభించాం. త్వరలో అన్ని పట్టణాలకూ సేవలు విస్తరిస్తాం. ప్రస్తుతం  హైదరాబాద్, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న మిత్రులు ఆయా పట్టణాల్లో సేవలందిస్తున్నారు. దయాగుణం గలవారి  –వర్రి శివప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏటీఏ

ఎంతో తృప్తి..
ఉద్యోగరీత్యా నిత్యం బిజీగా ఉండాల్సి వస్తోంది. కనీసం ఎవరికి సహా యం చేద్దామన్నా సమయం కేటాయించలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఏటీఏ ద్వారా ఆదరణలేని వృద్ధులకు సేవ చేయడం వల్ల  ఎంతో తృప్తి లభిస్తుంది.             –జీఎస్‌ భాస్కర్, కోశాధికారి, ఏటీఏ

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top