భారత్‌కు తిరిగొచ్చిన సోనియా | Sonia Gandhi returns home from US after routine medical check-up | Sakshi
Sakshi News home page

భారత్‌కు తిరిగొచ్చిన సోనియా

Sep 12 2013 3:52 AM | Updated on Oct 22 2018 9:16 PM

భారత్‌కు తిరిగొచ్చిన సోనియా - Sakshi

భారత్‌కు తిరిగొచ్చిన సోనియా

సాధారణ వైద్య పరీక్షల కోసం ఈ నెల 2న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భారత్‌కు తిరిగి వచ్చారు.

న్యూఢిల్లీ: సాధారణ వైద్య పరీక్షల కోసం ఈ నెల 2న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భారత్‌కు తిరిగి వచ్చారు. కుమార్తె ప్రియాంకాగాంధీతో కలిసి సోనియా అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళ్లారు. కాగా, ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో ప్రమేయమున్న పార్టీ నేతలను కాపాడుతున్నారనే ఆరోపణలపై సోనియాపై న్యూయార్క్ కోర్టులో దాఖలైన కేసుకు సంబంధించిన సమన్లను ఆమెకు పిటిషనర్లు పంపారు. న్యూయార్క్‌లో సోనియా చేరిన స్లోన్-కెట్టరింగ్ మెమోరియల్ ఆస్పత్రి నైట్‌షిఫ్ట్ సూపర్‌వైజర్‌కు సమన్ల కాపీ, ఫిర్యాదు, కోర్టు ఉత్తర్వులను అందించినట్లు సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రతినిధులు తెలిపారు. వాటిని సోనియాకు ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement