జూనియర్ అధ్యాపకులకు జరిమానా | Sakshi
Sakshi News home page

జూనియర్ అధ్యాపకులకు జరిమానా

Published Tue, Jan 19 2016 2:52 AM

Junior faculty To Fine

మంచిర్యాల సిటీ: ‘మీరు ఇంటర్ మూల్యాంకనం సరిగా చేయలేదు. విద్యార్థుల జవాబు పత్రాలు సరిగా దిద్దలేదు. జవాబుకు తగిన మార్కులు వేయలేదు. మార్కులను సరిగా కూడకుండా తప్పు వేశారు. మీరు చేసిన తప్పులకు విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థులు నష్టపోయినందు కు మీరు బోర్డుకు జరిమానా చెల్లించాలి’ అంటూ ఇంటర్ బోర్డు జూనియర్ అధ్యాపకులకు నోటీసులు జారీ చేసింది. 2015 ఏప్రిల్‌లో మూల్యాంకనానికి హాజరై తప్పు లు చేసిన అధ్యాపకులకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో వందల సంఖ్యలో విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు వెళ్లడంతో డొల్లతనం బట్టబయలైంది.

నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనంటూ ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు చెందిన(ఱ(ఖమ్మం జిల్లాకు సంబంధించి సమాచారం లభించలేదు) 2,387 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ చేసింది. ఒక్కో అధ్యాపకుడికి వారు చేసిన తప్పుల అధారంగా రూ. వెయ్యి నుంచి 15,000 వరకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది.

Advertisement
Advertisement