అఖిలేష్ తో మనోహర్ జోషి భేటీ | Joshi meets Akhilesh; discusses plans to develop Kanpur as defence hub | Sakshi
Sakshi News home page

అఖిలేష్ తో మనోహర్ జోషి భేటీ

Nov 14 2014 10:44 PM | Updated on Sep 2 2017 4:28 PM

అఖిలేష్ తో మనోహర్ జోషి భేటీ

అఖిలేష్ తో మనోహర్ జోషి భేటీ

బీజేపీ సీనియర్ నాయకుడు, కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశారు.

లక్నో: బీజేపీ సీనియర్ నాయకుడు, కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశారు. కాన్పూర్ ను డిఫెన్స్ హబ్ గా తయారుచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సీఎంతో చర్చించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇక్కడ నుంచి రాజ్యసభకు ఎన్నికకావడంతో కాన్పూర్ ను డిఫెన్స్ హబ్ గా తయారు చేయాలని నిర్ణయించినట్టు మనోహర్ జోషి తెలిపారు.

కాన్పూర్ ప్రస్తుత ఆదాయం 10 వేల కోట్లు అని చెప్పారు. డిఫెన్స్ హబ్ గా రూపొందితే ఆదాయం 20 వేల నుంచి 25 వేల కోట్లకు పెరిగే అవకాశముందన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కొత్త విధానంతో ఉత్తరప్రదేశ్ కు మేలు జరుగుతుందని, ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement