శుభకార్యానికి వెళ్లి స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన యువకుడు వాగులో పడి గల్లంతయ్యాడు.
ఆసిఫాబాద్ (ఆదిలాబాద్) : శుభకార్యానికి వెళ్లి స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన యువకుడు వాగులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లోని పెద్దవాగు వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాండూరు మండలం కాసిపేటకు చెందిన తిరుపతి(17) శుభకార్యం నిమిత్తం ఆసిఫాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలసి ఈత కొట్టడం కోసం వాగులోకి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.