మహిళా హోంగార్డు దారుణ హత్య | Women home gourd grievous murder | Sakshi
Sakshi News home page

మహిళా హోంగార్డు దారుణ హత్య

Sep 5 2014 11:38 PM | Updated on Jul 30 2018 8:29 PM

మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురైంది. నగర శివార్లలోని బాసిరేగడి అటవీ ప్రాంతంలో ఆమె తలపై రాళ్లతో మోది దారుణంగా హత్యమార్చారు.

మేడ్చల్: మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురైంది. నగర శివార్లలోని బాసిరేగడి అటవీ ప్రాంతంలో ఆమె తలపై రాళ్లతో మోది దారుణంగా హత్యమార్చారు. బాలానగర్ డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్, పేట్ బషిరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాలు.. నగరంలోని బేగంపేట్ రసూల్‌పూరలో నివసించే సురివి నవనీత (45) హైదరాబాద్ పోలీ స్ కమిషనర్‌రేట్ పరిధిలోని సెంట్రల్ జోన్‌లో హోంగార్డుగా నియామకమై కంట్రోల్‌రూంలో విధులు నిర్వహిస్తోంది.

రోజూ మాదిరిగానే నవనీత గురువారం తన నివాసం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు డ్యూటీకి బయలుదేరింది. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల సమయ ంలో మద్యం మత్తులో నడవలేని స్థితిలో ఆమె నగరంలోని లింగంపల్లి బస్టాప్‌లో స్థానికులకు కనిపించింది. అదే సమయంలో ఆమె తన ఆడపడుచూ ప్రమీలకు ఫోన్ చేసి తాను లింగంపల్లి బసా ్టండ్ వద్ద ఉన్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఆమె అక్కడ కూడా కనిపించలేదు.

 తలపై రాళ్లతో మోది హత్య..
 అయితే మేడ్చల్-గండిమైసమ్మ రోడ్డులో ఉన్న బాసిరేగడి అటవీ ప్రాంతలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాళ్లతో తలపై మోది హత్య చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో పోలీసులకు ఓ ఐడి కార్డు , ఓ సెల్ ఫోన్ లభ్యమయ్యాయి. ఆ ఐడి కార్డుపై నవనీత హోంగార్డు, హైదరాబాద్ సిటీ, ఎస్‌జి నంబర్ 1841 అని ఉంది. దీంతో పోలీసులు ఆ సెల్‌లోని నెంబర్లకు ఫోన్ చేసి ఆనవాళ్లు చెప్పగా హత్యకు గురైంది హోంగార్డు నవనీతేనని నిర్ధారించారు.

మృతురాలి కుమారుడు దుర్గాప్రసాద్,  బంధువులు సంఘటనా స్థలానికి చేరకొని తీవ్రంగా విలపించారు. సైబరాబా ద్ పోలీసులు  క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ ఎ.ఆర్. శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవనీత భర్త రెండేళ్లక్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఈమెకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ముగ్గురు కుమార్తెల వివాహాలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement