యువకుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా..!

Woman Protest At Lover House Seeking Justice In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ఆందోళన చేపట్టింది. మాయమాటలతో తనను లోబర్చుకుని గర్భం దాల్చడానికి కారకుడయ్యాడని, న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. సద్దాం అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అప్సరా అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అతని ఇంటిముందు ఆందోళన చేస్తున్న యువతికి ఎమ్మార్పీఎస్‌ నాయకులు, గ్రామం సర్పంచ్‌ యశోద తదితరులు మద్దతుగా నిలిచారు. 

అయితే, యువతిని ఇష్టపడిన మాట వాస్తవమేనని, ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పానని సద్దాం వెల్లడించాడు. అప్సరా వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను డీఎన్‌ఏ టెస్టుకు సిద్దం. నా వల్లనే ఆమె గర్భం దాల్చిందని రుజువైతే.. ఏ శిక్షకైనా రెడీ. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ, ఆమె వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోంది’ అన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top