పాలమూరు పురోగతికి సమష్టిగా కృషి చేద్దాం | we could work unitedly for the betterment of palamuru said collector sreedhevi | Sakshi
Sakshi News home page

పాలమూరు పురోగతికి సమష్టిగా కృషి చేద్దాం

Jan 26 2015 3:12 PM | Updated on Mar 21 2019 8:19 PM

పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ శ్రీదేవి పిలుపునిచ్చారు.

మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ శ్రీదేవి పిలుపునిచ్చారు. 66వ గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు.

అనంతరం పోలీసుల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా అన్ని విభాగాలు దృష్టి సారించాలన్నారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పథకాలు, వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని ఆమె వివరించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ విశ్వప్రసాద్, ఇన్‌చార్జ్ జేసీ రాజారాం, డీఆర్వో ఎం.రాంకిషన్, ఏఎస్పీ మల్లారెడ్డి, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement