రేపు హరికృష్ణ అంత్యక్రియలు

Tomorrow Nandamuri Harikrishna Funerals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కారు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు రేపు శంషాబాద్ దగ్గరగల ఫాంహౌస్‌లో జరగనున్నాయి. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. 

కామినేని ఆసుప‌త్రిలో పోస్ట్ మార్టం పూర్తైన త‌ర్వాత హ‌రికృష్ణ మృత‌దేహాన్నిహైదరాబాద్‌కి త‌ర‌లించ‌నున్నారు. ఇప్ప‌టికే హ‌రికృష్ణ కుమారులు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌తో పాటు త్రివిక్ర‌మ్, జ‌గ‌ప‌తి బాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, నారా లోకేష్ , బాలకృష్ణ, పురందేశ్వరి త‌దిత‌రులు ఆసుప‌త్రికి చేరుకున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top