ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు: కేటీఆర్‌

Telangana Minister Condolences To Nandamuri Harikrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మాజీ మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవచేశారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. హరికృష్ణ మృతిపట్ల ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘నా మిత్రులు కళ్యాణ్‌ రాం, ఎన్టీఆర్‌ల తండ్రి హరికృష్ణ మరణం చాలా బాధాకరం.

సీఎం కేసీఆర్‌ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారి కోరిక, ఏపీ సూచనల మేరకు అంత్యక్రియలపై నిర్ణయం జరిగింది. రేపు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పటికే అధికారులు మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నార’’ని తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top