భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
భద్రాచలం (ఖమ్మం) : భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత పగల్‌పత్తు ఉత్సవాలు శుక్రవారం మొదలై ఈ నెల 19 వరకూ జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి ఈ నెల 21 తేదీ వరకు నిత్య కల్యాణాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో కె.జ్యోతి తెలిపారు.


