కని పారేశారు..   | Small Kid Was Thrown Outside In Vikarabad | Sakshi
Sakshi News home page

కని పారేశారు..  

Feb 1 2020 7:13 AM | Updated on Feb 1 2020 7:16 AM

Small Kid Was Thrown Outside In Vikarabad - Sakshi

సాక్షి, వికారబాద్‌ : ముక్కుపచ్చలారని ఓ పసికందు (అప్పుడే పుట్టిన పాప)ను గుర్తుతెలియని వారు ముళ్లపొదల్లో పడేశారు. దీంతో ఓ కుక్క ఆ పసికందును పట్టుకెళ్తుండగా ఓ రైతు గమనించి పాపను కాపాడాడు. అనంతరం పాపను మర్పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబు అనే రైతు శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి పొలానికి వెళ్తున్నాడు. దారిలోని పొదల్లో పడి ఉన్న పసికందును కుక్క తన నోటితో పట్టుకుని వెళ్తుండగా గుర్తించాడు. వెంటనే కుక్కను వెళ్లగొట్టి పాపను రక్షించాడు. తర్వాత పాపను మర్పల్లిలోని కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి వైద్యులు పంపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement