మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌  | Sakshi
Sakshi News home page

మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ 

Published Wed, Jul 3 2019 2:27 AM

Notification for Replacement of Medical Management Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌–2019లో అర్హత సాధించిన అభ్యర్థులు కేటగిరీ బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) కోటాలో సీట్లకు బుధవారం ఉదయం 9 నుంచి 10వ తేదీ సాయంత్రం 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు  జ్టి్టhttps:// tspvtmedadm. tsche. in లో ఉంటాయి. ఈ నెల 11న ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును.. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ప్రొఫెసర్‌ రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (పీజీఆర్‌ఆర్సీడీఈ)లో నిర్వహిస్తారు. తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

దరఖాస్తుకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు 9502001583, 8466924522ను సంప్రదించాలి. పూర్తి సమాచారానికి వర్సిటీ వెబ్‌సైట్‌  www. knruhs. in,  www. knruhs. telangana. gov. in  ను చూడాలని వర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇదిలావుండగా 10 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద సీట్లు పెంచాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)కి దరఖాస్తు చేశాయి. కానీ ఇప్పటివరకు సీట్ల పెంపుపై ఎంసీఐ స్పష్టత ఇవ్వలేదు. ప్రైవేటులోని కన్వీనర్‌ కోటా సీట్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. వాటికి ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా వర్గాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement