
శక్తిమాన్ ట్రాక్టర్ తెలంగాణా ప్రభుత్వం ఒప‍్పందం
తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద వ్యవసాయ యంత్రాల తయారు సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద వ్యవసాయ యంత్రాల తయారు సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తిర్త్ ఆగ్రో (శక్తిమాన్ ట్రాక్టర్లు) తో కలిసి ఒక ఉత్పత్తి సంస్థను నెలకొల్పనుంది. ఈ మేరకు అవగాహన పత్రంపై సంతకాలు చేసినట్టు తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా ఎక్సెలెన్స్ అండ్ మానుఫ్యాక‍్చరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. తద్వారా ప్రత్యక్షంగా 500మందికి పరోక్షంగా మరో1500 మందికి ఉపాధి లభించనున్నట్టు పేర్కొన్నారు.
భారతదేశం లో వ్యవసాయ యంత్రాల తయారీ పేరుగాంచింది శక్తిమాన్ అనీ, 50శాతం మార్కెట్ వాటాతో 77కుపైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న సంస్థ శక్తిమాన్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో భూమి, వసతులు కల్పిస్తే ట్రాక్టర్ రొటోవేటర్ పరిశ్రమ నెలకొల్పుతామంటూ శక్తిమాన్ కంపెనీ ఆసక్తి చూపించింది. సుమారు రూ. 500 కోట్లతో పరిశ్రమను నెలకొ