గుడ్డు కట్‌.. కడుపు నిండట్లే

Low Quality In Mid day Meal Scheme In Nalgonda - Sakshi

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూలో కోత

గుడ్డు ధర రూ.5 పైన ఉండడంతో..

అరటిపండ్లు ఇస్తున్న నిర్వాహకులు

సాక్షి విజిట్‌లో వెలుగుచూసిన వాస్తవాలు

సాక్షి, నల్లగొండ : మధ్యాహ్న భోజనం సగంతోని సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం 150 గ్రాములు మాత్రమే ఇస్తుంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అది సరిపోని పరిస్థితి. దానికి తోడు ఉదయమే పాఠశాలకు వస్తుండడం వల్ల టిఫిన్‌ తినలేని పిల్లలు మధ్యాహ్నం ఆకలితో తిందామన్నా అది సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. వారానికి మూడు గుడ్లు పెట్టాల్సి ఉన్నా కొన్ని చోట్ల చిన్న అరటిపండుతోనే సరిపెడుతుండగా మరికొన్ని చోట్ల వారానికి ఒక్క గుడ్డే పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. బియ్యం కొన్ని చోట్ల మంచిగా ఉంటుండగా మరికొన్ని చోట్ల రావడం లేదు. వండిన అన్నం ముద్ద అవుతుంది. చారు నీళ్లను తలపిస్తే, కూరలు చారును తలపిస్తున్నాయి. రుచిపచిలేని వాటితో విద్యార్థులు తినలేకపోతున్నారు. జిల్లాలో మొత్తం 1,462 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు.

1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలోనే భోజనం పెడుతున్నారు. మొత్తం 1,05,020 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఇందులో ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు 54,286, 6 నుంచి 8వ తరగతి వరకు 28,944, 9, 10 తరగతులకు చెందిన  విద్యార్థులు 21,790 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతి విద్యార్థికీ 150 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు. వారానికి మూడు కోడిగుడ్లు అందించాలి. అయితే బియ్యం ప్రభుత్వమే ఇస్తుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఒక్కంటికి రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కంటికి రూ.6.51 ప్రభుత్వం మధ్యాహ్నం వంట నిర్వహకులకు చెల్లిస్తుంది. గుడ్డుకు అదనంగా రూ.4 చెల్లిస్తారు. ఈ డబ్బులతో కూర, చారు, గుడ్డు పెట్టాల్సి ఉంటుంది. అయితే గౌరవ వేతనం కింద వారికి ప్రతి నెలా రూ.వెయ్యి ఇస్తారు. ప్రతి పాఠశాలకు ఒక వంట మనిషి, అసిస్టెంట్‌ ఉంటారు.

ప్రధాన సమస్యలు ఇవీ..
► వంటగదులు లేవు. 
► ఉప్పునీటితోనే బియ్యం కడుగుతున్నారు. దీంతో అన్నం పచ్చగా అవుతోంది. 
► తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇంటివద్దనుంచి బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. 
► నీళ్లచారు, అన్నంలో పురుగులు
► కూరగాయలు సరిగా ఉడకడం లేదు. 

వారం మెనూ
►  సోమవారం కూరగాయలు, గుడ్డు, చారు
మంగళవారం  పప్పు, ఆకుకూరలు, చారు
► బుధవారం గుడ్డు, కూరగాయలు, చారు
► గురువారం సాంబారు, కూరగాయలు
► శుక్రవారం గుడ్డు, పప్పుతో కూరగాయలు 
► శనివారం వెజిటేబుల్‌ బిర్యాని

ప్రతి విద్యార్థికి అందజేయాల్సిన మెనూ ఇలా..
ఆహార పదార్థాలు  1–5తరగతి  6–10తరగతి వరకు
బియ్యం  10గ్రాములు 150గ్రాములు
ఆయిల్‌  5గ్రాములు  7.5గ్రాములు
పప్పు  20గ్రాములు 30గ్రాములు
కూరగాయలు 50గ్రాములు 75గ్రాములు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top