ఆ ఊర్లో మందు తాగకూడదు | kondamrajupali village bans sale, consumption of liquor | Sakshi
Sakshi News home page

ఆ ఊర్లో మందు తాగకూడదు

Apr 14 2017 7:55 PM | Updated on Jul 18 2019 2:26 PM

ఆ ఊర్లో మందు తాగకూడదు - Sakshi

ఆ ఊర్లో మందు తాగకూడదు

ఆగ్రామంలో ఎవరూ మద్యం అమ్మొద్దని పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు

సిద్దిపేట : ఆగ్రామంలో ఎవరూ మద్యం అమ్మొద్దని పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. జిల్లాలోని కొండంరాజుపల్లిలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చీకటి పడగానే మద్యం సేవించి మందుబాబులు గొడవలకు దిగుతున్నారని తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే జరిమానా విధించాలని కోరారు. దీనికి స్పందించిన సర్పంచ్‌ తుంగ కనుకయ్య అప్పటికప్పుడు గ్రామ పంచాయతీలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. అనంతరం మద్య నిషేధ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎల్ల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బాగు తిరుపతి, సభ్యులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement