అనాథలకోసం ప్రత్యేక చట్టం

Kishan Reddy Speaks About Force For Orphans Rights And Community Empowerment - Sakshi

ప్రధాని దృష్టికి తీసుకెళ్తా: కిషన్‌రెడ్డి

ముగిసిన ఫోర్స్‌ సదస్సు  

నాగోలు: అనాథల కోసం పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నా రు. నాగోలు తట్టిఅన్నారంలోని జె–కన్వెన్షన్‌లో జరుగుతున్న ఫోర్స్‌ ఫర్‌ ఆర్ఫన్స్‌ రైట్స్‌ అండ్‌ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్‌ (ఫోర్స్‌) అంతర్జాతీయ సదస్సు రెండో రోజు ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అనాథల అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగే విధంగా కృషిచేస్తానని తెలిపారు.

గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనాథ విద్యార్థులకు సర్టిఫికెట్ల కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తే, అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. అనాథాశ్రమాలు నడిపే ప్రతినిధులంతా ఢిల్లీ వస్తే ఈ విషయంపై ఇతర శాఖ మంత్రులతో చర్చించి వారి అభివృద్ధికి కావలసిన చర్యలు తీసుకుందామని తెలిపారు. మాజీ పార్లమెంట్‌ సభ్యులు, బీజేపీ నాయకులు వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ, అనాథల సంక్షేమానికి స్వచ్చంధ సంస్థలతో పాటు రాజకీయ నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనాథలను ఆదుకోవడానికి వెంకటస్వామి ఫౌండేషన్‌ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top