అయ్యో దేవా.. ఇవేం పనులు

అయ్యో దేవా.. ఇవేం పనులు - Sakshi


ఐనవోలు(వర్ధన్నపేట) : బ్రహోత్సవాలకు ముస్తాబవుతున్న ఐనవోలు మల్లన్న ఆల యంలో అభివృద్ధి పనుల మాటున శాస్త్ర విరుద్ధ పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. క్రీ.శ. 1077-1129 మధ్య కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ పురాతన ఆలయం కాకతీయ శిల్పకళకు  అద్దం పడుతోంది. ఈ ఆలయంలో ఏటా జరిగే మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కలెక్టర్ కిషన్ నేతృత్వంలో ఈ నెల 5న ఆయా శాఖల జిల్లా అధికారులతో గ్రామంలో సమీక్ష సమావేశం నిర్వహించి జాతర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

అభివృద్ధి పనుల్లో డొల్లతనం

భక్తులకు మెరుగైన సేవలందించాలనే తలంపుతో రూ.లక్షలు ఖర్చు చేసి అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆల యం ఎదురుగా ప్రాంగణంలో కుడి, ఎడ మ వైపు షాబాద్ బండ పరుస్తున్నారు. ఈ పనులు భక్తుల మనోభావాలకు విరుద్ధంగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ అర్బన్ డెవలప్‌మెం ట్(కుడా) ఆధ్వర్యంలో రూ. 16 లక్షలతో ఆలయం కుడివైపున షాబాద్ బండతో ఫ్లోరింగ్ పూర్తి కాగా, రెండో విడతలో రూ. 20 లక్షలతో ఎడమవైపు ఫ్లోరింగ్ పనులు ప్రారంభించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ గర్భగుడి కంటే తక్కువ ఎత్తులో ఈ ఫ్లోరింగ్ పనులు చేపట్టాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా రెండు అడుగుల (ఫీట్లు) ఎత్తుగా ఈ పనులు చేస్తున్నార ని పూజారులు విమర్శిస్తున్నారు. పురావస్తు, దేవాదాయశాఖ సమక్షంలో జరగాల్సిన అభివృద్ధి పనుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

 

వైభవాన్ని కోల్పోతున్న కాకతీయ కట్టడాలు

ఆలయ అభివృద్ధి కోసం 2010లో పురావస్తుశాఖ రూ.కోటి విడుదల చేయగా ఆర్‌ఆండ్‌బీ శాఖ పనులు చేపట్టింది. ఈ నిధులతో ఆలయంలో ఫ్లోరింగ్ పనులు చేశారు. రెండేళ్లు కొనసాగిన ఈ పనులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆలయం ఎదురుగా ఉన్న నృత్యమండపం అభివృద్ధి చేయాల్సి ఉండగా పనులు చేయకుండానే సంబంధిత కాంట్రాక్టర్ నిధులు విడుదల చేసుకున్నాడ నే విమర్శలున్నాయి. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న నృత్యమండపాన్నిఅభివృద్ధి చేశాక ఫ్లోరింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా ముందే ఫ్లోరింగ్ పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు.



నృత్యమండపంను అభివృద్ధి చేసే సమయంలో ఫ్లోరిం గ్ కోసం వేసిన బండలు(షాబాద్) పగిలి పోయే ఆస్కారం కూడా ఉంది. ఇదే జరిగి తే ప్రస్తుతం చేపట్టిన పనులు వృథాగా మా రుతాయి. ముందుచూపు లోపించడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ, పురావస్తుశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆలయ అభివృద్ధి పనుల్లో మార్పు చేసి కాకతీయ శిల్పకళను, భక్తు ల మనోభావాలను కాపాడుతూ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top