
భళా.. బాలోత్సవ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగుతున్న బాలల పండుగ బాలోత్సవ్ మూడో రోజూ ఉత్సాహభరితంగా కొనసాగింది.
అలరించిన ప్రదర్శనలు
నేడు ముగింపు వేడుకలు
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగుతున్న బాలల పండుగ బాలోత్సవ్ మూడో రోజూ ఉత్సాహభరితంగా కొనసాగింది. పాఠశాలల్లో తరగతి గదులకే పరిమితమనుకున్న విద్యార్థులు బాలోత్సవ్‌లో తమలోని కళను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ నెల 10న ప్రారంభమైన బాలోత్సవ్‌లో భాగంగా మూడోరోజు శనివారం వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి నిర్విరామంగా కొనసాగిన కార్యక్రమాల్లో వేలాది మంది చిన్నారులు వివిధ అంశాల్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి న్యాయ నిర్ణేతలనే ఆలోచనలో పడేశారు. సుమారు 14 వేదికలపై నిరంతరంగా కొనసాగిన పలు కళా ప్రదర్శనల్లో అనేకం సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉన్నారుు.
వరకట్నపు జాఢ్యాన్ని నిర్మూలించాలన్న సందేశాత్మక నృత్యంతోపాటు గ్రామీణ వాతావరణానికి అద్దంపట్టి ఐక్యతారాగాన్ని ఆలపించేలా చేసిన పలు జానపద గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నారుు. ఇక పేరిణి నాట్యం శనివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేకమంది చిన్నారులు పోటాపోటీగా పేరిణి ప్రదర్శనలు చేయడంతో న్యాయనిర్ణేతలు ఆలోచనలో పడాల్సి వచ్చింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో పలువురు విద్యార్థినులు చేసిన సాహసోపేతమైన ప్రదర్శనలు ప్రేక్షకులను కనులవిందు చేశారుు. విద్యార్థుల్లో కళాత్మకతను వెలికితీసేందుకు మట్టితో బొమ్మలు చేసే అంశంలో నిర్వహించిన పోటీలో పలువురు పోటీపడి అద్భుత కళాఖండాలను సృష్టించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు మట్టివిగ్రహాల ప్రాధాన్యతను వివరించారు. ఈ బాలోత్సవ్ ఆదివారం ముగియనుంది. ఏడు రాష్ట్రాల నుంచి వేలాది మంది బాలలు ఈ వేదికపై కళా ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. అనేకమంది బాలలకు ఇక్కడి బాష తెలియకపోరుునా తమ హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు.
నేటితో ముగియనున్న బాలోత్సవ్..
ఈనెల 10న ప్రారంభమైన బాలోత్సవ్ ఆదివా రంతో ముగియనుంది. ముగింపు సభకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రముఖ సినీ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, రసమరుు బాలకిషన్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరు కానున్నారు