ఢిల్లీలో ధర్నా చేయండి

Do dharna in Delhi - Sakshi

పసుపు బోర్డు ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు: బాబా రాందేవ్‌ 

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటుకు రైతులతో కలసి ఢిల్లీలో ధర్నా చేయాలని యోగా గురువు బాబా రాందేవ్‌ సూచించారు. మంగళవారం ఎంపీ కవిత కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుం దని చెప్పారు.

తెలంగాణ ఉద్యమ తరహాలో నిరసనలు చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఇదివరకే ఎంపీ కవిత ప్రధాన మంత్రికి , కేంద్ర మంత్రులను కలసి వినతులు సమర్పించారని అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తనవంతు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ యోగా ప్రస్తుత జీవనశైలికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. బాబా రాందేవ్‌ 3 రోజుల పాటు జిల్లాలో ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం గర్వకారణమన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top