15 గ్రాముల పాప్‌కార్న్‌ తక్కువ.. రూ.10వేల జరిమానా

Department of Weights and Measurements Officers Inspections in a Theatre at Jangaon - Sakshi

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని స్వర్ణ కళామందిర్‌(సినిమా థియేటర్‌)లో తూనికలు, కొలతల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. థియేటర్‌ క్యాంటీన్‌లో 60 గ్రాముల పాప్‌కార్న్‌ను రూ.40తో అమ్ముతుండగా.. తక్కువగా వస్తోందని ప్రేక్షకులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారి విజయ్‌కుమార్‌ నేతృత్వంలో తనిఖీలు చేసి.. క్యాంటిన్‌ యజమానిపై కేసు నమోదు చేశారు. 60 గ్రాముల పాప్‌కార్న్‌లో 15 గ్రాములు తక్కువగా వస్తోందని గుర్తించి రూ.10వేల జరిమానా విధించినట్లు అధికారి తెలిపారు. నిర్దేశిత ధరల కంటే అదనంగా అమ్మినా, తూకంలో మోసం చేసినా కఠిన చర్యలు ఉంటాయని విజయ్‌ కుమార్‌ హెచ్చరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top