
'దుమ్మెత్తి పోస్తే వారిమీదే పడుతుంది'
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజల ఆశీర్వాదంతో మరో పదేళ్లపాటు సీఎంగా ఉంటారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరబాద్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజల ఆశీర్వాదంతో మరో పదేళ్లపాటు సీఎంగా ఉంటారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ గిరిజన సంక్షేమ సఘం(టీజీఎస్‌ఎస్), జీవీఎస్ ఆధ్వర్యంలో రవీంద్రభారతీలో కొమరం భీమ్ అవార్డ్స్, సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో జనరంజక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయని తెలిపారు. దుమ్మెత్తే వారి మీదనే దుమ్ముపడుతుందని చెప్పారు. తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. అన్ని వర్గాలకు సబ్సిడీతో కూడిన పథకాలు ఇస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పది కాలాలపాటు ఉండాలని ధీవించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి మహముద్ అలీ మాట్లాడుతూ..వచ్చే ఏడాది నాటికి గిరిజనులు తమ సొంత భవనంలోఇలాంటి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.