కోదండరాం రెచ్చగొడుతున్నారు: చంద్రబాబు | chandrababu naidu dig at kodandaram | Sakshi
Sakshi News home page

కోదండరాం రెచ్చగొడుతున్నారు: చంద్రబాబు

May 19 2014 7:32 PM | Updated on Jul 29 2019 2:51 PM

కోదండరాం రెచ్చగొడుతున్నారు: చంద్రబాబు - Sakshi

కోదండరాం రెచ్చగొడుతున్నారు: చంద్రబాబు

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. సీమాంధ్రులకు తాము రక్షణ కల్పిస్తామని ఆయన హామీయిచ్చారు. హైదరాబాదులోని కానీ, తెలంగాణలో కానీ ప్రజలకు బాధ్యత తమదేనని అన్నారు.

తెలంగాణ ఏర్పడ్డా ఆంధ్రపాలకుల కుట్రలు ఆగలేదని, 2019లో టీడీపీ తెలంగాణలో అధికారంలో వస్తుందని చెప్పడం ఇందుకు ఉదాహరణ అని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఇలాంటివి తెలంగాణ ప్రజలు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కోదండరాం వ్యాఖ్యలపై చంద్రబాబు పైవిధంగా స్పందించారు.

టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను ఆయన కలిశారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్టు చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పారదర్శంగా జరగాలని గవర్నర్ను కోరినట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement