బ్రిడ్జ్ పైనుంచి పడిపోయిన ట్యాంకర్ | car turns turtle: si injured in karimnagar district | Sakshi
Sakshi News home page

బ్రిడ్జ్ పైనుంచి పడిపోయిన ట్యాంకర్

May 12 2016 4:27 AM | Updated on Sep 2 2018 3:44 PM

బ్రిడ్జ్ పైనుంచి పడిపోయిన ట్యాంకర్ - Sakshi

బ్రిడ్జ్ పైనుంచి పడిపోయిన ట్యాంకర్

వరంగల్ ఉర్సు బైపాస్ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి ప్రమాదవశాత్తు ఆరుుల్ ట్యాంకర్ కింద పడింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు.

డ్రైవర్ దుర్మరణం.. క్లీనర్‌కు తీవ్రగాయాలు
 
 కరీమాబాద్: వరంగల్ ఉర్సు బైపాస్ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి ప్రమాదవశాత్తు ఆరుుల్ ట్యాంకర్ కింద పడింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఏలూరులోని దెందులూర్ ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బల్క్ క్యారియర్ లారీ ట్యాంకర్ ఆర్‌బీ ఆరుుల్‌తో ఢిల్లీ వెళ్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైకి రాగానే ట్యాంకర్ అదుపు తప్పి ఫుట్‌పాత్ పైకి ఎక్కింది. అంతే కాకుండా బ్రిడ్జి గోడను బలంగా తాకి పైనుంచి కిందపడిపోయింది.

దీంతో లారీ ట్యాంకర్ ధ్వంసమవ్వడంతో పాటు లారీ డ్రైవర్ శ్యాంవీర్‌సింగ్ మృతి చెందగా, క్లీనర్ దినేశ్‌కు తీవ్ర గాయూలయ్యూరుు. ఇదిలా ఉండగా లారీ ట్యాంకర్ కింద పడగానే బయటకు వచ్చిన ఆర్‌బీ ఆయిల్(తౌడు ఆయిల్)ను సమీప ప్రాంత ప్రజలు తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement