
కేకే భూముల రిజిస్ట్రేషన్ రద్దు?
ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన రెవెన్యూ యంత్రాంగం.. రిజిస్ట్రేషన్ రద్దు అంశాన్ని కూడా పొందుపరిచింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే దీనిపై తదుపరి అడుగు వేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.