నిజామాబాద్ బైపాస్ రోడ్డుకు గ్రహణం వీడటం లేదు. 30 మాసాలలో పూర్తి కావాల్సిన ఈ పనులు ఆరేళ్లు కావస్తున్నా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మిగిలిపోయాయి.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ బైపాస్ రోడ్డుకు గ్రహణం వీడ టం లేదు. 30 మాసాలలో పూర్తి కావాల్సిన ఈ పను లు ఆరేళ్లు కావస్తున్నా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మిగిలిపోయాయి. నిజామాబాద్ ప్ర జల వినతి మేరకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బైపాస్ రోడ్డు నిర్మాణాని కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.11 కి లోమీటర్ల పొడవున రెండు వరసల రహదారితోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మా ణం కోసం రూ.80 కోట్లు మంజూరు చేసారు.
మొద టి విడతగా రూ.50 కోట్లు కూడా విడుదలయ్యాయి. అయితే, అన్ని అర్హతలతో ఈ టెండరును పొందిన కాంట్రాక్టర్‌పై రాజకీయంగా ఒత్తిడి తెచ్చిన నిజామాబాద్‌కు చెందిన ఉప గుత్తేదారు పనులను దక్కిం చు కున్నట్లు చెబుతున్నారు. ఆయన పనులు చేపట్టి ఆరే ళ్లు పూర్తయ్యాయి. అధికారులు మూడు విడతలుగా గడువును పొడిగించారు. పనులు మాత్రం పూర్తి కాలేదు.
ఇదీ అసలు సంగతి
నిజామాబాద్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజ లకు సౌకర్యంగా ఉండేందుకు బైపాస్ రహదారిని ని ర్మించాలని భావించారు. వెనువెంటనే స్థానిక అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతి రాగానే టెండర్లు నిర్వహించి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. మొ త్తం రూ. 80 కోట్ల పనులను 30 నెలలలోగా పూర్తి చే యాలని ఆదేశించారు.
దీని ప్రకారం 2011 ఆగస్టు 18లోగా ఈ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. కాం ట్రాక్టు పొందిన సంస్థ అయితే ఇప్పటికే ఈ పనులు పూర్తయ్యేవనీ, రాజకీయ ఒత్తిళ్లతో పనులు పొందిన ఉప గుత్తేదారు నిర్లక్ష్యం, ఆర్‌అండ్‌బీ అధికారుల ఉ దాసీనతతో ‘పుష్కర’కాలం పట్టే పరిస్థితి దాపురిం చిందని పలువురు ఆరోపిస్తున్నారు. చేసేది లేక ప్రభుత్వం నిర్మాణ గడువును 31ఆగస్టు 2013 నాటికి, రెండోసారి 31మార్చి 2014 నాటికి పెంచింది. అయి నా ఫలితం లేకపోవడంతో ముచ్చటగా మూడోసారి 30 సెప్టెంబర్ 2014కు పెంచింది. ఈ నెలాఖరు వర కు కూడా పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు.
భూసేకరణ పూర్తి అయినా!
2013 ఆగస్టు వరకు భూసేకరణను సాకుగా చూపిన ఉప గుత్తేదారు, ఆ అడ్డంకులు తొలగినా నిర్మాణ ప నులపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. రూ.80 కోట్లలో దాదాపు రూ.34 కోట్లు భూసేకరణకే కేటాయించారు. అధికారుల సమాచారం మేరకు 2013 అక్టోబర్ నాటికి ఇందులో రూ.25.05 కోట్లు చెల్లించారు. 2014 జూన్ వరకు రూ.17.33 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి.
రెండోసారి గడువు పెంచిన తర్వాత నామమాత్రంగా పనులు చేసిన ఉప గుత్తేదారు ఆ తర్వాత వదిలేశారు. తాజాగా పెరిగిన పనుల విలువ ప్రకారం అంచనా రూ.66.30 కోట్లు కావడం, ఈ నెల 30తో మూడోసారి గడువు కూడ ముగియనుండటంతో పనుల వేగం పెంచినట్లుగా చెప్తున్నారు. నాలుగోసారి కూడ గడువు కోరే ప్రయత్నంలో ఉప గుత్తేదారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా బైపాస్ నిర్మాణం పనుల వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.