27 చలానాలు పెండింగ్‌.. వాహనం సీజ్‌

Bike Sease When Pending 27 Challans Hyderabad - Sakshi

రూ. 4650ల 27 పెండింగ్‌

చలనాలు ఉన్న ద్విచక్ర వాహనం సీజ్‌

సుల్తాన్‌బజార్‌ (హైదరాబాద్‌): వివిధ ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడి 27 పెండింగ్‌ చలనాలు కట్టకుండా ఉన్న ఓ వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని సుల్తాన్‌బజార్‌ పోలీసులు సీజ్‌ చేసారు. ఆదివారం విస్తృత తనిఖీలలో భాగంగా సుల్తాన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని హానుమాన్‌టేకిడి క్రాస్‌రోడ్స్‌ వద్ద ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారామిరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు మధుసూధన్, నర్సింగ్‌రావులు వారి సిబ్బందితో వాహనాల తనిఖిలు నిర్వహిస్తున్నారు.

హుస్సేనీహాలం, దూద్‌బౌలికి చెందిన మిర్జా రజాఅలీ(42), టీఎస్‌ 12 ఎబి 8383 నెంబర్‌ గల ఫ్యాషన్‌ ప్రో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అతని వాహనాన్ని ఆపిన పోలీసులు అతని బండిపై ఉన్న చలానా చిట్టాను చూసి ఆశ్చర్యపోయారు. రూ.4650 గల 27 పెండింగ్‌  చలానాలు ఉండడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సోమవారం మిర్జా ఈ సేవలో చలానాలు చెల్లించడంతో అతని వాహనాన్ని పోలీసులు రిలీజ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top