సాయం అంతలోనే మాయం!

Banks Cutting Government Money Bank Charges Named Peddapalli - Sakshi

చార్జీల పేరిట బ్యాంకుల కోత

పెద్దపల్లి, మంథని: రేషన్‌ కార్డు దారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1500 సాయంలో బ్యాంకర్లు చార్జీల పేరిట కోత విధిస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు అరకొర మాత్రమే చేతికందుతున్నాయి. ఆధార్‌ అనుసంధానం, జీరో బ్యాలెన్స్‌ ఖాతాల్లోనే ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ సాయం జమఅయింది. అయితే ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయని కారణంగా ప్రభుత్వం సాయం నుంచి ఒక్కొక్కరికి రూ.118 నుంచి రూ.1300 వరకు కోత విధించారు. బియ్యంతోపాటు నేరుగా రూ.1500 లబ్ధిదారు చేతికే డబ్బు అందిస్తే బ్యాంకు చార్జీల మోత ఉండేది కాదని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా తాము కావాలని కోత విధించడం లేదని బ్యాంకు సాప్ట్‌వేర్‌ ఆధారంగా ఆటోమెటిక్‌గా ఖాతాలో డబ్బు జమకాగానే పెనాల్టీ చార్జీలు కట్‌ అవుతాయని ఓ బ్యాంకు మేనేజర్‌ తెలిపారు.(ఆగిన పోస్టల్‌ నగదు పంపిణీ)

రెండు వందలే చేతికొచ్చాయి
ప్రభుత్వం సాయం రూ. 1500 ఖాతాలో జమ అయ్యాయని సమాచారం రాగానే బ్యాంకుకు వెళ్లా. డబ్బు తీసుకునేందుకు విత్‌డ్రా రాసి ఇస్తే కేవలం ఖాతాలో     రెండు వందలే ఉన్నాయని బ్యాంకు అధికారి చెప్పారు. ఇదేంటని అడిగితే చార్జీల కింద కట్‌ అయిందని చెప్పారు. వచ్చే నెల సాయం పూర్తిగా తీసుకోవచ్చన్నారు. బియ్యంతోపాటే రూ.1500 చేతికిస్తే మా లాంటి పేదవారికి ఎంతో ఉపయోగపడేవి.–తాటి స్రవంతి, గంగాపురి, మంథని

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top