
సాక్షి, హైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా ఆర్థిక సహాయం పొందాలనుకునే దేవాలయాలు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకో వాలని బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్, హోం మంత్రి నాయిని నర్సంహారెడ్డి సూచించారు. శనివారం సచివాలయంలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ నెల 20లోగా దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం పొందని దేవాలయాలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.