ఆంధ్రా బ్యాంకులో చోరీకి యత్నం | Andhra Bank stole the attempt | Sakshi
Sakshi News home page

ఆంధ్రా బ్యాంకులో చోరీకి యత్నం

Aug 17 2015 4:46 AM | Updated on Sep 3 2017 7:33 AM

ఆంధ్రా బ్యాంకులో చోరీకి యత్నం

ఆంధ్రా బ్యాంకులో చోరీకి యత్నం

మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకులో శనివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి యత్నించారు...

- కిటికీ, సీసీ కెమెరాల ధ్వంసం
- సైరన్ మోగడంతో పరారైన దొంగలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్
పిట్లం :
మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకులో శనివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు ఒంటిగంట ప్రాంతంలో దొంగలు కిటికీ ఊచలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. ముందుగా సీసీ కెమెరాల వైర్లను తొలగించారు. అనంతరం లాకర్ తలుపులను తెరవడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకు సైరన్ మోగింది. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో దొంగలు పారిపోయూరు.

బ్యాంకులోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఈ సంఘటనలో ఇద్దరు దొంగలు ఉన్నట్లు తెలుస్తోంది. ముందురోజు బ్యాంకు కిటికీ తలుపులను సిబ్బంది పెట్టకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. చోరీ జరగకపోవడంతో ఖాతాదారులు, గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఆది వారం మేనేజర్ ఎన్‌వీ.సుబ్బారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో డబ్బు చోరీకి గురికాలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమెదర్ కోన వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement