హాస్పిటల్‌ నుంచి యంగ్‌ హీరో డిశ్చార్జ్‌

Actor Sharwanand Discharged From Hospital - Sakshi

హైదరాబాద్‌ : షూటింగ్‌లో గాయపడి ఆస్పత్రిలో చేరిన హీరో శర్వానంద్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. భుజానికి గాయాలు కావడంతో శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు శుక్రవారం అతన్ని ఇంటికి పంపించారు.ఈ సందర్భంగా వైద్యులు అతనికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

‘96’ సినిమా చిత్రీకరణ భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్‌ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో శర్వానంద్‌ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత వెంటనే థాయ్‌లాండ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న శర్వానంద్‌ చికిత్స కోసం సన్‌షైన్‌ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ నలుగురు డాక్టర్లతో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శర్వానంద్‌కు శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. గాయం పెద్దది కావడంతో అతనికి రెండు నెలల బెడ్‌ రెస్ట్‌ అవసరమని వైద్యులు సూచించారు. కాగా, శర్వానంద్‌కు గాయం కారణంగా ‘రణరంగం’, ‘96’  సినిమాల షూటింగ్‌కు అంతరాయం ఏర్పాడింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top