ల్యాప్‌ట్యాప్‌ల దొంగ దొరికాడు! | accused arrested in laptop robbery cases | Sakshi
Sakshi News home page

ల్యాప్‌ట్యాప్‌ల దొంగ దొరికాడు!

Jan 24 2017 10:17 PM | Updated on Oct 4 2018 8:29 PM

ల్యాప్‌ట్యాప్‌ల దొంగ దొరికాడు! - Sakshi

ల్యాప్‌ట్యాప్‌ల దొంగ దొరికాడు!

కరీంనగర్‌ బస్టాండ్‌ వద్ద ల్యాప్‌ట్యాప్‌ చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కరీంనగర్‌: కరీంనగర్‌ బస్టాండ్‌ వద్ద  ల్యాప్‌ట్యాప్‌ చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రెండు ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడు చెంగల్‌పడ్‌ జిల్లా మహాలక్ష్మినగర్‌కు చెందిన వెంకటరమణ రాజశేఖర శాస్త్రిగా గుర్తించారు. గతంలో చోరీకి గురైన ల్యాప్‌ట్యాప్‌ కేసుల్లో ఇతడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మొత్తం 16 ల్యాప్‌ట్యాప్‌ చోరీ కేసుల్లో రాజశేఖర శాస్త్రి నిందితుడు.

తెలంగాణ, ఆంధ్రతో పాటు పలు రాష్ట్రాల్లో తెలివిగా చోరీలు చేసిన ల్యాప్‌ట్యాప్‌ను తమిళనాడులో బాలాజీ అనే వ్యక్తికి 10 నుంచి 15 వేల రూపాయలకు విక్రయించినట్లు తెలిపాడు. బస్సుల్లో ల్యాప్‌ట్యాప్‌లతో ప్రయాణించే యువకుల్ని టార్గెట్‌గా చేసుకుని నిందితుడు చోరీలకు పాల్పడుతున్నాడని విలేకరుల సమావేశంలో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement