ఈత కొలనుల వద్ద ప్రమాద హెచ్చరికలు

Accidental And Danger  Swimming Pools - Sakshi

పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీల ఏర్పాటు

ఆసిఫాబాద్‌ : వేసవి సెలవుల్లో ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన విద్యార్థులు, ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సీఐ బాలాజీ వరప్రసాద్‌  ఆధ్వర్యంలో పోలీసులు  మండలంలోని వాగులు, ఒర్రెల వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వేసవిలో సరదా కోసం ఈత కొలనుల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యు వాత పడుతున్నారని, ముందు జాగ్రత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈతకు వెళ్లడం నిషేదమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఎస్సై ఖమ్రొద్దీన్, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top