లంబోర్గిని లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌, ధరవింటే షాక్‌ | Lamborghini's New Android Smartphone Revs Into Mobile Market, Priced at Rs 1.5 Lakh | Sakshi
Sakshi News home page

లంబోర్గిని లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌, ధరవింటే షాక్‌

Aug 24 2017 10:28 AM | Updated on Sep 17 2017 5:55 PM

లంబోర్గిని లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌, ధరవింటే షాక్‌

లంబోర్గిని లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌, ధరవింటే షాక్‌

ఇటాలియన్‌ లగ్జరీ కారు తయారీదారు లంబోర్గిని గ్లోబల్‌గా మొబైల్‌ మార్కెట్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వచ్చేసింది. ఓ కొత్త సూపర్‌ లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

ఇటాలియన్‌ లగ్జరీ కారు తయారీదారు లంబోర్గిని గ్లోబల్‌గా మొబైల్‌ మార్కెట్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వచ్చేసింది. ఓ కొత్త సూపర్‌ లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ను లంబోర్గిని లాంచ్‌ చేసింది. ఆల్ఫా-వన్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర సుమారు 1.57 లక్షల రూపాయలు. ఈ ధరల్లోనే వ్యాట్‌ ఛార్జీలు కూడా కలిసి ఉన్నాయి. అదనపు కస్టమ్స్‌ పన్నులను ఇక కొనుగోలుదారులే భరించాల్సి ఉంటుంది. లంబోర్గిని తన సూపర్‌ కార్లలో వాడే డెంట్‌ రెసిస్టెంట్‌ లిక్విడ్‌ అలోయ్‌తో ఆల్ఫా-వన్‌ను రూపొందించింది. టైటానియం కంటే అలోయ్‌ ఎక్కువ మన్నికమైంది. 
 
ఆల్ఫా వన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు...
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 820 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌
5.5 అంగుళాల 2కే అమోలెడ్‌ డిస్‌ప్లే
2560x1440 పిక్సెల్‌ రెజుల్యూషన్‌
20మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
8మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ యూకే, యూఏఈలలో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చినట్టు అంతర్గత రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. దుబాయ్‌, లండన్‌ మాల్స్‌లో లగ్జరీ బొటిక్స్‌ బ్రాండ్స్‌ వద్ద కూడా ఇది లభించనుంది. ఈ ఫోన్‌తో పాటు ఇటాలియన్‌ లెదర్‌ స్లీవ్‌ ఫోన్‌ కేసు కూడా కొనుగోలుదారులకు వస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement