చిన్నారి సహా తల్లి బలవన్మరణం | woman commits suicide in yadadri district | Sakshi
Sakshi News home page

చిన్నారి సహా తల్లి బలవన్మరణం

Dec 30 2016 12:47 PM | Updated on Sep 4 2017 11:58 PM

భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన చిన్నారితో పాటు ఆత్మహత్య చేసుకుంది.

మోటకొండూరు: భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన చిన్నారితో పాటు ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వంగపల్లి గ్రామానికి చెందిన నవ్య(21)కు నాలుగేళ్ల క్రితం నాంచారిపేటకు చెందిన గచ్చ నరేష్‌తో వివాహమైంది. వారికి ఒక కుమార్తె మాధురి ఉంది. గత కొంతకాలంగా నరేష్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
 
ఎంత మంది వైద్యులకు చూపించినా ఫలితం లేదు . దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ్య గురువారం రాత్రి బాత్‌రూంలో కుమార్తెతో పాటు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. వారు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజు సంఘటన స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement