దూకుడుగా ఆడుతున్న దక్షిణాఫ్రికా | south africa fight back against team india in first twenty 20 | Sakshi
Sakshi News home page

దూకుడుగా ఆడుతున్న దక్షిణాఫ్రికా

Oct 2 2015 9:22 PM | Updated on Sep 3 2017 10:21 AM

దూకుడుగా ఆడుతున్న దక్షిణాఫ్రికా

దూకుడుగా ఆడుతున్న దక్షిణాఫ్రికా

తొలి ట్వంటీ 20మ్యాచ్ లో భాగంగా టీమిండియా విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా దాటిగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

ధర్మశాల:తొలి ట్వంటీ 20మ్యాచ్ లో భాగంగా టీమిండియా విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా దూకుడుగా  బ్యాటింగ్ కొనసాగిస్తోంది. దక్షిణాఫ్రికా ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా(31), ఏబీ డివిలియర్స్(35) క్రీజ్ లో ఉన్నారు.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.  దీంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.  భారత్ స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ శిఖర్ ధవన్(3) అనవసర పరుగుకోసం యత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు.

అనంతరం రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ(106; 66బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు)  సెంచరీని పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ ట్వంటీ20 ల్లో తొలి సెంచరీని రోహిత్ నమోదు చేశాడు. రోహిత్ కు జతగా విరాట్ కోహ్లి (43) రాణించడంతో రెండో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement