సాకేత్‌ ముందంజ | Saketh Myneni enter to 2nd round | Sakshi
Sakshi News home page

సాకేత్‌ ముందంజ

Nov 14 2018 1:52 AM | Updated on Apr 4 2019 5:04 PM

Saketh Myneni enter to 2nd round - Sakshi

బెంగళూరు: భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌ 6–3, 7–6 (7/3)తో ఆదిల్‌ కల్యాణ్‌పుర్‌ (భారత్‌)పై గెలుపొందాడు.

ఈ మ్యాచ్‌లో సాకేత్‌ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్‌ 6–2, 6–2తో నెడొల్కో (రష్యా)పై, శశికుమార్‌ 7–6 (8/6), 6–3తో అల్టామిరానో (అమెరికా)పై నెగ్గారు. డబుల్స్‌ తొలి రౌండ్‌లో విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జంట 6–4, 6–3తో సుమీత్‌ నాగల్‌ (భారత్‌)–బ్రైడెన్‌ ష్నుర్‌ (కెనడా) జోడీపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement