‘డియర్‌ భారత్‌ ఫ్యాన్స్‌.. ఫైనల్‌ టికెట్లు అమ్మండి’

Jimmy Neesham Wants Indian Fans to do Resell World Cup 2019 Final Tickets - Sakshi

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కొన్న భారత అభిమానులు వాటిని తిరిగి అమ్మాలని న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఆదివారం జరిగే ఈ మెగా సంగ్రామంలో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు అమితుమీ తెల్చుకోనున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆధ్యాంతం ఆధిపత్యం కనబర్చిన భారత జట్టుకు ఫైనల్‌ బెర్త్‌ ఖాయమని ఇటు అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావించారు. దీంతో భారీ ఎత్తున్న ఫైనల్‌ మ్యాచ్‌కు భారత అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. కానీ కోహ్లిసేన పోరాటం సెమీస్‌తోనే ముగియడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫైనల్‌ మ్యాచ్‌కు రాని భారత అభిమానులు ఆ టికెట్లను తిరిగి అమ్మివేయాలని నిషమ్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశాడు.

‘డియర్‌ భారత క్రికెట్‌ అభిమానులారా.. మీరు ఫైనల్‌ మ్యాచ్‌కు రాకపోతే దయచేసి ఆ టికెట్లను అధికారిక ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా తిరిగి అమ్మండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికి అనిపిస్తుంది. కానీ దయచేసి సంపన్నులే కాకుండా నిజమైన అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి.’ అంటూ నీషమ్‌ ట్వీట్‌ చేశాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ పోరులో భారత్‌ 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 18 పరుగుల తేడాతో ఓడి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top