ఊహించని ట్విస్ట్ ఇచ్చిన షమీ భార్య!

Hasin Jahan Back Step  In Husband Mohammed Shami Case - Sakshi

ఆరోపణలపై వెనక్కి తగ్గిన హసీన్ జహాన్

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా పేసర్‌ మహ్మద్ షమీపై వ్యక్తిగత ఆరోపణ (వివాహేతర సంబంధాలు, గృహహింస)లతో పాటు, కెరీర్‌కు సంబంధించి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్‌ జహాన్‌. కానీ బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమెను విచారణ చేపట్టిన నేపథ్యంలో క్రికెటర్ భార్య యూటర్న్ తీసుకున్నారు. విచారణలో భాగంగా హసీన్ జహాన్‌ను శనివారం సాయంత్రం అధికారులు పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో తడబాటుకు లోనవుతూ, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండటం తెలిసిందే. 

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తన భర్త షమీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ తాను ఆరోపించినట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు హసీన్ జహాన్. ఇంగ్లండ్‌కు చెందిన మమ్మద్ బాయ్ అనే వ్యక్తి సాయంతో పాకిస్తాన్‌కు చెందిన అలిషబా అనే మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని మాత్రమే చెప్పానన్నది సారాంశం. తనకు అసలు క్రికెట్ ఆట గురించే ఎలాంటి అవగాహన లేదని, అలాంటప్పుడు భర్త షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎలా ఆరోపిస్తానని జహాన్ ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. షమీ కెరీర్ కు ఏ ఇబ్బంది లేదంటూ క్రికెటర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, నగదు అంశంపై షమీ, అతడి భార్య హసీన్ జహాన్ ఫోన్‌లో మాట్లాడుతూ గొడవపడ్డట్లు ఆడియో టేపుల్లో గుర్తించినట్లు బీసీసీఐ అవినీతీ నిరోధకశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు షమీని అధికారులు ఆదివారం విచారించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను బీసీసీఐకి ఇవ్వనున్నారు. షమీ క్రికెట్ భవితవ్యం ఆ నివేదికపై ఆధారపడి ఉంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top