చరితా దేవికి స్వర్ణం | Charita Devi gets Gold Medal in Skating Championship | Sakshi
Sakshi News home page

చరితా దేవికి స్వర్ణం

Nov 19 2018 10:34 AM | Updated on Nov 19 2018 10:34 AM

Charita Devi gets Gold Medal in Skating Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్థాయి రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డికి చెందిన చరితా దేవి స్వర్ణంతో మెరిసింది. ఇందిరాపార్క్‌లోని స్కేటింగ్‌ రింక్‌లో ఆదివారం జరిగిన బాలికల (12–16) క్వాడ్‌ 3000మీ. స్పీడ్‌ స్కేటింగ్‌ ఈవెంట్‌లో చరిత విజేతగా నిలిచింది. నల్లగొండకు చెందిన మృలాని రజతాన్ని, మెదక్‌ ప్లేయర్‌ లిఖిత కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు అండర్‌–16 బాలికల కేటగిరీలో డి. శ్రీవిజ్ఞా రెడ్డి రాణించింది. 1000మీ. రోడ్‌ ఈవెంట్‌లో రజతం నెగ్గిన శ్రీవిజ్ఞ... రింక్‌ రేస్‌ ఈవెంట్‌లో కాంస్యాన్ని గెలుచుకుంది.

పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రోలర్‌ స్కేటింగ్‌ సంఘం (ఆర్‌ఎస్‌ఏటీ) అధ్యక్షుడు మదన్‌మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఆర్‌ఎస్‌ఏటీ ఉపాధ్యక్షులు రామ్‌ప్రసాద్, అబ్జర్వర్‌ కల్యాణ్, కార్యదర్శి నిర్మల్‌ ప్రసాద్, టెక్నికల్‌ కమిటీ చైర్మన్‌ నూర్‌ మొహమ్మద్, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. ప్రేమ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement