‘వంద కోట్లకు పైగా తగలేశారు’ | Vijayasai Reddy Tweet On Chandrababu Davos Tour | Sakshi
Sakshi News home page

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

Jul 29 2019 4:13 PM | Updated on Jul 29 2019 6:23 PM

Vijayasai Reddy Tweet On Chandrababu Davos Tour - Sakshi

దావోస్‌లో చంద్రబాబు (ఫైల్‌)

దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు ఐదేళ్లలో చంద్రబాబు వంద కోట్లకు పైగా తగలేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు దావోస్‌లో ఏపీ లాంజ్ కోసం రూ.17 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేయడంపై దర్యాప్తు జరగాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. నాలుగు రోజుల భోజనాలకు రూ. 1.05 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారో తేలాలన్నారు. ‘రోమ్ తగలడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని మరపించారు చంద్రబాబు. నీటి కొరత, రోగాలు, కరువు, తుఫాన్లతో ఇక్కడ ప్రజలు విలవిల్లాడుతుంటే దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు ఐదేళ్లలో వంద కోట్లకు పైగా తగలేశారు. ఒరిగింది శూన్యం. ఒక్క పరిశ్రమ రాలేదు​’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
(చదవండి: దావోస్‌లో ఏపీ లాంజ్‌ ఖర్చు రూ.17 కోట్లు)

పారదర్శక పాలన అందించే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి కొత్త దిశను చూపించారని ప్రశంసించారు. రూ. 100 కోట్లు దాటిన ప్రభుత్వ టెండర్లను న్యాయపరిశీలన తర్వాతే ఖరారు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవినీతికి అడ్డుకట్ట పడటంతో పాటు పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. టెండర్లలో అక్రమాలు, పక్షపాతం, అవినీతి అడ్డుకట్టకు ప్రభుత్వం ఇటీవల ఏపీ మౌలిక​ సదుపాయాలు(ముందుస్తు న్యాయపరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు-2019కి అసెంబ్లీ ఈ నెల 26న ఆమోదం తెలిపింది. (చదవండి: కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ..! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement