
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహిన్ బాగ్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని కలవబోతున్నట్లు యోగా గురువు బాబా రాందేవ్ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో రాందేవ్ మాట్లాడుతూ..తనకు హిందువులు, ముస్లీంలు ఇద్దరు సమానమని..ముస్లీం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెళ్తున్నానని అన్నారు. ముస్లీం ప్రజలకు అన్యాయం జరిగితే వారి నిరసనలకు మద్దతిస్తానని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలందరికి నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని..అయితే రాజ్యాంగానికి లోబడే నిరసనలు తెలపాలని ఆయన సూచించారు. తాను హిందు, ముస్లీం ప్రజలు ఘర్షణ పడాలని కోరుకోనని, ముసీం ప్రజలకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలబడతానని పేర్కొన్నారు. స్వాతంత్రం కోసం పోరాడే అన్ని రకాల నిరసనలకు తాను మద్దతిస్తానని అన్నారు. జిన్నా వాలా భావాలకు తాను వ్యతిరేకమని, భగత్ సింగ్ భావాలకు తాను సంపూర్ణ మద్దతిస్తానని బాబా రాందేవ్ తెలిపారు.