ఆమెను సజీవ దహనం చేస్తా : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

I Will Burn Sadhvi Pragya Alive : Congress MLA - Sakshi

భోపాల్‌ : భోపాల్‌ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను సజీవ దహనం చేస్తానని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే అసలైన దేశభక్తుడంటూ బుధవారం పార్లమెంటులో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాలు ఖండించారు. దీని ఫలితంగా రక్షణ మంత్రిత్వ సలహా కమిటీ నుంచి ప్రజ్ఞాను బీజేపీ తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మధ్యప్రదేశ్‌లో అడుగుపెడితే సజీవ దహనం చేస్తానని బయోరా ఎమ్మెల్యే గోవర్థన్‌ డంగీ ప్రకటించారు. మరోవైపు సాధ్వీ వ్యాఖ్యలకు నిరసనగా ఆమె నియోజకవర్గమైన భోపాల్‌లో గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి.    చదవండి : (లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top