
సాక్షి, న్యూఢిల్లీ : నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గానికి సీపీఐ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లపాటు జనం మధ్య తిరిగిన అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని బాధ్యాతాయుతంగా నడిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తారని తాను భావించడం లేదని తెలిపారు. విశాఖలో విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని.. వాటిపై గత ప్రభుత్వం వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం రిపోర్టు బయటపెట్టి దోషులను బయటకి తీసుకు రావాలని ఆయన కోరారు.
కేసీఆర్ కూడా చంద్రబాబులాగే వ్యవహరిస్తున్నారని నారాయణ మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం అనైతిక చర్య అన్నారు. గవర్నర్ తక్షణమే ఈ చర్యలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. విపక్షాలు లేకుండా చూస్తే.. జనమే ప్రతిపక్షమవుతురాని హెచ్చరించారు. కేసీఆర్‌కు చూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందన్నారు నారాయణ.